Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
యువత, విద్యార్థులు డ్రగ్స్, మాదకద్రవ్యాలు అలవాటు చేసుకోకుండా, వాటికి బానిసలు కాకుండా ఉండేందుకు 'ఓ యువత..మేలుకో..డ్రగ్స్ మానుకో..అనే అంశంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హిమాయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మీ రామన్ గౌడ్ తెలిపారు. సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను నారాయణగూడ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎస్ఐ ఎం.శివకష్ణ, హెడ్ కానిస్టేబుల్ సి.హెచ్.కొండల్ రావు, సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల ముఖ్యంగా యువత, విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దశల వారీగా డివిజన్లోని కళాశాలలు, ఎడ్యుకేషన్ సంస్థలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు జి.రామన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కె.నర్సింగ్ ముదిరాజ్, నాయకులు నర్సింగ్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.