Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యోగ భద్రత కోసం ఉద్యమిస్తామని జేఏసీ చైర్మెన్ డాక్టర్ ఎం. రామేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ అన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. నూతన చైర్మెన్‌గా డాక్టర్ ఎం. రామేశ్వరరావు, కన్వీనర్‌గా డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ ఎన్నికయ్యారు. ఎం. తిరుపతి, డాక్టర్. జి. వెంకటేశ్వర్లు, పల్లా రేష్మారెడ్డి, డాక్టర్. మంజు, కష్ణవేణి, శ్రీలత, ఉదరు కుమార్, డాక్టర్. అజరు కుమార్, డాక్టర్. ఆర్డీ ప్రసాద్, డాక్టర్. పెంచాల శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మణ్, భాస్కర్, జితేందర్, శ్రీనివాస్ రెడ్డి, హరీష్, యాదగిరి, డాక్టర్. సోమేశ్, డాక్టర్. దత్తహరి, డాక్టర్ నారాయణ గుప్తా, డాక్టర్. నాగేశ్వర్, డాక్టర్. యాలాద్రి, డాక్టర్ జోష్ణ, డాక్టర్. యాలాద్రి, డాక్టర్. రవీందర్ రెడ్డి, డాక్టర్. సంరీన్ తదితరులు కోకన్వీనర్, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రామేశ్వర్ మాట్లాడుతూ జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, సర్వీస్ రాటిఫికేషన్, పీఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రూప్ హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్, సాధించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.