Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూకట్పల్లి ఎమ్మెల్యే
మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
అత్యాధునిక సదుపాయాలతో శ్మశానవాటికలను సుందరీకరిస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కేపీహెచ్‌బీ కాలనీలో చేపడుతున్న శ్మశాన వాటిక, రైతు బజార్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతు బజార్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలన్నారు. రైతులకు అన్ని సదుపాయాలతో, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక సదుపాయాలతో రైతు బజార్‌ను నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయమం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లో బాస్కెట్ బాల్ పార్కులో వ్యాయమశాలను ప్రారంభించారు. అనంతరం 6వ ఫేజ్‌లోని ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షటిల్ కోట్లు, ఇండోర్ స్టేడియంలు, వాకిటాకీ, ప్రత్యేక మహిళా పార్కు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. చిన్నారులకు శారీరక ధారుఢ్యాం కల్పించే క్రీడలను ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.