Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోకు దెబ్బ రాష్ట్ర కమిటీ వినతి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ హైమద్కు కమిటీ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సా గౌడ్, సెక్రటరీ జనరల్ రాగుల సిద్దిరాములు గౌడ్ మాట్లాడుతూ జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ అని నామకరణం చేయాలని, పాపన్న గౌడ్ పరిపాలించిన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించి తగిన నిధులు కేటాయించి అభివద్ధి చేయాలని కోరారు. కల్లుగీత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి కార్యవర్గాన్ని నియమించి నిధులు కేటాయించి కల్లుగీత వత్తిదారుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం జాన్కమ్ పేట్ గ్రామంలో ఎలాంటి కల్తీ లేకున్న కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి రద్దు చేసిన టి.ఎఫ్.టి లైసెన్సులను పునరుద్ధరించాలని కోరుతూ ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఆబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ హైమద్ లకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసినట్లు వారు గుర్తు చేశారు. ఈ విషయంలో కమిషనర్ వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు ఎరుకల గోవర్ధన్ గౌడ్, హర్షవర్ధన్ గౌడ్, మక్తాల శైలజ గౌడ్, రాగుల కిరణ్ కుమార్ గౌడ్, ఇళ్లసగరపు మాధవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.