Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
వికలాంగుల కోసం త్వరలో ఆశ్రమం ఏర్పాటుచేస్తామని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. డాక్టర్ రమణ 70వ జన్మదిన సందర్భంగా మసాబ్ ట్యాంక్ వద్దనున్న కార్యాలయంలో అభిమానులు, కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగుల పట్ల సానుభూతితో నెలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 3,016 రూపాయల భతి అందిస్తున్నారని వివరించారు. రాబోయే కాలంలో కేవీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మానసిక వికలాంగులకు, అంగవైకల్యం వారి కోసం ఆశ్రమం రూపొందిస్తానని హామీ నిచ్చారు. అనంతరం వికలాంగులకు ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.