Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓయూ రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ నేత కంచి. మనోహర్
ఓయూ విశ్రాంత ఉద్యోగుల
జనరల్ బాడీ సమావేశం
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో పదవీ విరమణ చేసిన పింఛన్ దారులకు 2021 జూన్‌లో వెలువడిన జీఓ ప్రకారం పీఆర్సీ, ఏరియర్స్‌ను చెల్లించాలని ఓయూ రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ నేతలు కంచి. మనోహర్ కోరారు. మంగళవారం ఓయూ నాన్ టీచింగ్ హోమ్‌లో ఏర్పాటు చేసిన ఓయూ రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయస్ వెల్పేర్ అసోసియోషన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీఓను ఓయూలో ప్రస్తుతానికి పనిచేస్తున్న అధ్యాపకులకు, బోధనేతర ఉద్యోగులకు ఏరియర్స్ ఇచ్చి తమకు నేటికి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఓయూ వీసీ ప్రొ. రవీందర్‌ను కలిస్తే డబ్బులు లేవు చూస్తాం అంటూ దాటవేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 8 నెలల ఏరియర్స్ చెల్లించాలని, ఏరియర్స్‌ను ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాం అని చెప్పడం బాధాకరం అని అన్నారు. ఓయూలో సుమారు 3,700 మంది బోధనేతర రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. వీరికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమ పింఛన్స్, ఏరియర్స్ సాధన కోసం ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మరొక వైపు మనోహర్‌కు ఓయూ వీసీ ప్రొ. రవీందర్ ఫోన్ చేసి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. సమావేశంలో ఉద్యోగులు టి.మల్లేష్, సిద్ది బేగ్, మాధవ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పార్థసారథి, రుక్కయ్య, మహమూద్, ఖదీర్ ఖాన్, అక్బర్ బేగ్,శివ శంకర్ పాల్గొన్నారు.