Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్
నవతెలంగాణ-అడిక్‌మెట్
గాంధీనగర్ డివిజన్లోని సురభి పార్క్ అభివద్ధిని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడం తగదని గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. పార్క్ అభివద్ధిపై హార్టికల్చర్ అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు. అనంతరం పావని మాట్లాడుతూ గాంధీనగర్ డివిజన్లో జరిగే అభివద్ధి కార్యక్రమాలను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆయన అనుచరులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గత మూడేండ్లలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, పదేండ్లుగా కార్పొరేటర్‌గా ఉన్న పద్మ నరేష్ లు పార్క్ అభివద్ధి విషయంలో పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తాను కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత పార్కుల అభివద్ధి చేయడంలో పట్టుదలతో ముందుకు వెళ్తున్న ఈ క్రమంలో ఏవో కుంటి సాకులు చెబుతూ కాంట్రాక్టర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందారు. అభివద్ధిలో పోటీ పడాలి తప్ప అభివద్ధిని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో హార్టికల్చర్ మేనేజర్ మురళి, అసిస్టంట్ వెంకటేష్, బీజేపీ నాయకులు వినరు కుమార్, ఉమేష్, నవీన్ కుమార్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, ప్రశాంత్, సతీష్ పాల్గొన్నారు