Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుపై అన్ని రంగాల్లో వివక్ష చూపుతోందని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. మంగళవారం ఓయూ ఫ్యాకల్టీ క్లబ్ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ, రాష్ట్ర హక్కులను కాలరాస్తుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐటీఆర్ ప్రాజెక్టు అనేక విషయాలలో వివక్ష కొనసాగుతోందన్నారు. వందేండ్ల చరిత్ర ఉన్న సింగరేణిని ప్రయివేటు పరం చేసి తెలంగాణ కార్మికులకు అన్యాయం చేయవద్దని కోరారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో దళిత బంధును మేనిఫెస్టోలో పెట్టే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. జై శ్రీరామ్ అనే బీజేపీ ఇపుడు రాజకీయ పబ్బం కోసమే జై భీమ్ అంటోందన్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ పన్నిన ట్రాప్లో దళితులు పడొద్దన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు బీజేపీ గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు శిగ వెంకటేష్, కార్యదర్శులు ఆవాల హరిబాబు, నవీన్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఒగ్గు శివ, సంపత్, యద క్రాంతి, కొంపల్లి నరేష్, కాటాం శివ, రణు, నరేందర్. రెడ్డి, బాల్ రాజ్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.