Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ డివిజన్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టి ఉన్నాయని, వాటి స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను డివిజన్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మీ రామన్ గౌడ్ కోరారు. మంగళవారం డివిజన్లోని విఠల్ వాడి కాలనీలో విద్యుత్ శాఖ అధికారి మహిపాల్ రెడ్డి, సిబ్బందితో కలిసి తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను పరిశీలించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో ఎక్కడైతే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయో వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జి.రామన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కె.నర్సింగ్ ముదిరాజ్, స్థానిక నాయకులు సందీప్, వేణుగోపాల్, శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.