Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్ మంగళవారం ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా క్లాసులో బోధన ఎలా జరుగుతుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓయూ లేడీస్ హాస్టళ్లలో చీఫ్ వార్డెన్ డా.కోరెము .శ్రీనివాసరావు, లేడీస్ హాస్టల్ డైరెక్టర్ ప్రొ. బి.పద్మ లతో కలిసి పర్యటించారు. ఓయూలో క్యాంటీన్‌తో పాటుగా పలు కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, సెక్రెటరీ సునీల్ కుమార్, హెచ్ఓడీ ప్రొఫెసర్ దీప్లా, ప్రొ. సత్యనారాయణ, రీసెర్చ్ స్కాలర్ జాతీయ క్రీడాకారులు బాబులాల్, అశోక్ నాయక్ పాల్గొన్నారు.