Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్వీనర్ సీట్లను మరోదఫా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలి
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని సెట్స్ కన్వీనర్ సీట్లను మరోదఫా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్ అన్నారు. లేడీస్ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నిరసనకు దిగారు. పీజీ సెకండ్ ఇయర్ మహిళా విద్యార్థులను ఉన్నపళంగా వేరే హాస్టల్కు షిఫ్ట్కావాలని ఆదేశాలు జారీ చేయడం బాధాకరం అన్నారు. వాటర్, విద్యుత్, టాయిలెట్స్, కనీస వెంటిలేషన్ ఫెసిలిటీ కూడా లేనటువంటి బిల్డింగ్కు షిఫ్ట్ కావాలని అధికారులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల గోసను చెప్పుకోవడానికి వీసీ, రిజిస్ట్రార్లు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. కన్వీనర్ సీట్లను స్పాట్ అడ్మిషన్లు పేరుతో మేనేజ్మెంట్ కోటాలో కాలేజీలు అమ్ముకుంటున్నాయి వినతి పత్రం ఇచ్చిన కనీస స్పందన లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీని వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. శాంతియుతంగా వినతిపత్రం ఇద్దామంటే యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారని, ఈక్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా విద్యార్థి ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అరవింద్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ధర్మారపు శ్రీకాంత, విజరు నాయక్, శ్రీను, రమేష్, అఖిల్, శ్రీకాంత్, లా విద్యార్థి గౌరీష్, కిషోర్ తదితర విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.