Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఎస్ఎఫ్ఐ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో పీజీ సెట్ ద్వారా ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయాలని సోమవారం రిజిస్ట్రార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వారిని గేట్ వద్ద ప్రయివేట్ సెక్యూరిటీ ఇవ్వకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. బి సెక్యూరిటీ కామాండెంట్ రాహుల్ మరికొంత మంది సెక్యూరిటీ సిబ్బంది గార్డ్స్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేత అరవింద్‌ను గాయపరడంతో మంగళవారం ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఓయూలో విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఇలా విద్యార్థుల వీధిరౌడీలా విచక్షణ రహితంగా దాడులు ఎంత వరకు సమంజసం అని ఓయూ ఎస్ఎఫ్ ఐ కార్యదర్శి రవి నాయక్ ప్రశ్నించారు. దాడులుతో విద్యార్థి ఉద్యమాలు ఆపలేరని అన్నారు. దీనిపై రాహుల్‌ను వివరణ కోరగా అలాంటిదేం లేదని రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నట్టు చెప్పారు.