Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక
నవతెలంగాణ-బంజారాహిల్స్
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే ఆయన పదవికి రాజీనామా చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సీఎం అదే రాజ్యాంగాన్ని మర్చాలని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. భారత రాజ్యాంగం ఈ మాత్రం అమలైతేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ స్థాయిలో ఉన్నారన్నారు. రానున్నది వారిదే రాజ్యామని గ్రహించి జీర్ణించుకోలేక అక్కసుతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారాని ఆరోపించారు. సాగర తీరాన నిర్మిస్తానన్న బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ 125 అడుగుల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. ఎన్నో ఏండ్లుగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులందరినీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భరత్ వాఘ్మారే జాతీయ అధ్యక్షులు విజరు కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇందర్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి గోపాల్, స్టేట్ మహిళా అధ్యక్షులు షర్మిల, నారాయణ్ నాయక్, మురహరి, ఆంజనేయులు, రాములు, రాజయ్య, ప్రభాకర్, అశోక్, సురేష్, బబ్లూ, విఠల్ తదితరులు పాల్గొన్నారు.