Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
దళితులను విడగొట్టాలని చూసే వారికి తగిన బుద్ధి చెబుతామని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మార్చి 13న జరిగే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ కులాల అభివద్ధికి ఎనిమిదేండ్ల నుంచి వార్షిక బడ్జెట్ కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా షెడ్యూల్డు కులాల మాల-మాదిగల మధ్య ఏ,బీ,సీ,డీ అనే నెపంతో ఇద్దరి మధ్య కుట్రలతో కూడిన చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎస్సీ కులాల ఐకమత్యానికి భంగం కలిగిస్తూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో మాల మాదిగలను మోసం చేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని చెప్పారు. శాస్త్రీయ పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనను నిర్వహించి ఎస్సీల్లో ఉపకులాల వివరాలను సర్వే జాబితాలో పొందుపరచి వారి జనాభాను నిర్దిష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏ, బీ, సీ, డీ వర్గీకరణకు మద్దత్తు ఇస్తున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 13న హైదరాబాద్‌లో జరిగే సింహగర్జనను విజయవంతంచేయాలన్నారు.