Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
మాదక ద్రవ్యాలతో కుటంబాలు ఛిన్నాభిన్నమవుతాయని ఇన్స్పెక్టర్ బిక్షపతి అన్నారు సుల్తాన్‌బజార్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ టెకిడిలోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు విక్రయించినా, వినియోగించినా నేరమని, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారని అదనపు డీఐ రఘుబాబు అన్నారు. బ్యాంకు, ఏటీఎం కార్డు రెన్యూవల్, క్రెడిట్, డెబిట్ కార్డులు, వడ్డీలేని రుణాలు, కేవైసీ అప్ డేట్ వంటి ఫోన్లు, సందేశాలు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100ను వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్సై సుజాత, ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, నరేష్ కుమార్ (డీఎస్సై)తో పాటు కళాశాల ప్రిన్సిపల్ డా. ఎ. మాధవీలత, వైస్ ప్రిన్సిపల్ రాజ్ గోపాలన్ ఆయా విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలతో అనర్థాలెన్నో
మాదకద్రవ్యాలు వాడితే కలిగే దుష్ప్రభావాలపై నిజాం కళాశాల విద్యార్థులకు అబిడ్స్ పోలీసులు అవగాహన కల్పించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ విద్యార్థులకు మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల గురించి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్లొద్దని సూచించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని విద్యాసం స్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్ఐ లు నరేష్, లిఖిత, ఏఎస్ఐ ధన్ రాజ్ పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలు మానవాళికి చేటు
నవతెలంగాణ-ధూల్‌పేట్
మాదకద్రవ్యాలు మానవాళికి చేటు అని చార్మినార్ ఏసీపీ బిక్షం రెడ్డి అన్నారు. ప్రభుత్వ సిటి కళాశాల జాతీయ సేవావిభాగం ఆద్వర్యంలో చార్మినార్ సర్కిల్ పోలీస్ విభాగం వారి సౌజన్యంతో మాదక ద్రవ్యాలు, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్, పోస్కో-యాక్ట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలతో ఆరోగ్యంతోపాటు, భవిష్యత్‌ను కోల్పోతారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్‌ను ఎదుర్కొనే మెలకువలు, అనర్థాలకు లోను కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. ఇన్స్పెక్టర్ గురు నాయుడు, ఎస్ఐ ప్రశాంతి, ప్రిన్సిపాల్ డా.పి. బాలభాస్కర్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు జయ కాగడా, డా.నాగరాజ్ పాల్గొన్నారు.