Authorization
Fri March 21, 2025 08:45:41 am
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
నూతన నటీ,నటులతో సరికొత్త అంశంతో వెబ్ సిరీస్‌ను ప్రారంభించడం అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు రాజా రవీంద్ర అన్నారు. ఓజస్వి ఎంటర్టైన్మెంట్ సారథ్యంలో యువ దర్శకుడు మానస్ దండ నాయక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'ది కనెక్షన్' వెబ్ సిరీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల యుగం నడుస్తోందని, వీటివల్ల అనేకమంది నూతన నటీనటులకు అవకాశం దొరుకుతుంది అన్నారు. చిత్ర దర్శకుడు మానస్ మాట్లాడుతూ కలుషితమవుతున్న గంగా నదిని తిరిగి ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో పర్యావరణ శాస్త్రవేత్త చేసేటటువంటి రీసెర్చ్‌లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఈ చిత్రం కొనసాగుతుందని అన్నారు. వారణాసి బ్యాక్ డ్రాప్లో పకడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేసుకున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి సరికొత్త విధానంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి చుక్కా అవినాష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.