Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ సంజరు కుమార్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ బండ మైసమ్మ, తాళ్లబస్తీలో యువతీ యువకులకు మత్తు పదార్థాల ద్వారా కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో యువత మత్తుకు బానిసవుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి, గుడుంబా, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల్ని సేవించినా, రవాణా చేసిన వారి వివరాలు 100 నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అప్స లాంటి స్వచ్ఛంద సంస్థలు మత్తుపదార్థాలపై వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు కిరణ్ కుమార్, నాగరాజు, సురేష్, హరిబాబు, అప్స కోఆర్డినేటర్ బొట్టు రమేష్, ప్రతినిధులు శ్రావణి, బస్తీ నాయకులు, కళాబృందం విజరు కుమార్, బుగ్గయ్య పాల్గొన్నారు.