Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ తిప్పరాజు వెంకట నగేష్
నవతెలంగాణ-బంజారాహిల్స్
వైద్యం సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు గుదిబండగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు ఆరోగ్య నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని డాక్టర్ తిప్పరాజు వెంకట నగేష్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైక్రోసాఫ్ట్ సీనియర్ డైరెక్టర్ సురేంద్ర, వైద్యులు శివకుమార్ రామచంద్ర విజరులతో కలిసి మాట్లాడారు. సుమారు 130 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందని ద్రాక్షల ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన 40 ఏండ్ల సుదీర్ఘ వైద్య జీవితంలో వైద్యం కోసం మధ్యతరగతి ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయానని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందించవచ్చునని చెప్పారు. ప్రభుత్వం ప్రతిరోజు జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపై కేవలం 3 శాతం వైద్య సెస్‌గా విధించి తద్వారా సమకూరిన ఆదాయంతో రాష్ట్రంలోని ప్రజలందరికీ హెల్త్‌కార్డులు, అందించడం ద్వారా మెరుగైన వైద్యం అందించవచ్చని అన్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసి పేద, ధనిక భేదం లేకుండా అందరికీ వైద్యం అందించే అంశంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.