Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నగరానికి చేరిన బెంగాల్ యువకుడు ప్రసంజీత్ దాస్
నవతెలంగాణ-బేగంపేట్
పశ్చిమ బెంగాల్ ముర్తిదాబాద్ జిల్లా లాల్గోలా చెందిన ప్రసంజీత్ దాస్ గత ఏడాది డిగ్రీ పూర్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ, రక్తదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆగస్టు 25న సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇలా పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్, బీహార్, హర్యానా, జమ్ము కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 189 రోజులకు 11,841 కిలోమీటర్లు పూర్తి చేసి రెండు రోజుల కిందట హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జయకర్ డేనియల్ ఆయనకు ఆతిథ్యమిచ్చి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వైఎంసీఏ ప్రధాన కార్యదర్శి లినార్డ్, ప్రతినిధులు జేమ్స్ కెన్నెత్, సంపత్, కల్యాణ్ లతో కలిసి ప్రసంజీత్ను ఘనంగా సన్మానించారు.