Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ సర్కిల్ 29 నూతన డిప్యూటీ కమిషనర్‌గా తాళ్లపల్లి దశరథ్ బాధ్యతలు స్వీకరించారు. అయన గతంలో ఖైరతాబాద్‌లో బిల్ కలెక్టర్‌గా, సీనియర్ అసిస్టెంట్ ఎలక్షన్స్‌గా, ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా, అబిడ్స్‌లో హెల్త్ సెక్షన్లో సూపరింటెండెంట్‌గా, ముషీరాబాద్‌లో వ్యాల్యూవేషన్ ఆఫీసర్‌గా, రాజేంద్రనగర్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా, ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. అనంతరం కూకట్పల్లి, ముసాపేట్, కాప్రా, మల్కాజిగిరి డిప్యూటి కమిషనర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ స్వచ్ఛతా, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను ప్రజలు, వ్యాపార సంస్థలు సత్వరమే చెలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శానిటేషన్‌కు ప్రాధాన్యత ఇస్తూ అధికారుల, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడనున్నట్టు చెప్పారు. గురువారం పలువురు అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆయన్ను సత్కరించారు.