Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
నగరంలోని టోలిచౌకీలో సినిమా షూటింగ్‌ను తలపించేలా ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ పేషెంట్ మెడపై కత్తి పెట్టి హంగామా సష్టించాడు. కానీ పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి టోలిచౌకీ ఏరియాలో గోల్కొండ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. నాంపల్లికి చెందిన రౌడీషీటర్ ఫరీద్ క్వాద్రీ అటుగా వచ్చాడు. పోలీసులను గమనించి పారిపోయేందుకు యత్నించాడు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. పోలీసులు తనను వెంబడించడంతో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలోకి దూరి ఓ రోగి మెడపై కత్తి పెట్టాడు. తనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఖబర్దార్ అంటూ రోగి మెడపై కత్తి పెట్టడమే కాకుండా దగ్గరకొస్తే రోగి మెడ కోస్తానని బెదిరించాడు. ఈ ఘటన అంతా సినిమా షూటింగ్‌ను తలపించింది. ఆస్పత్రిలో ఉన్న రోగుల అంతా కొన్ని గంటలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.