Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్
ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
కేర్ మేనేజర్ల నెట్‌వర్క్‌తో కూడిన సంపూర్ణమైన, సాంకేతికాధారిత వ్యక్తిగతీకరించిన సీనియర్ కేర్ ప్లాట్‌ఫామ్ అన్వయా అందిస్తుందని సంస్థ ఎండీ, వ్యవస్థాపకులు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గురువారం బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో సంస్థ అందిస్తున్న సేవలపై ఆయన ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతిక నిపుణులతో పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకుని వయోవద్ధులకు సేవలందించడానికి అన్వయా కిన్ కేర్ ప్రయివేట్ లిమిటెడ్ ఎల్లవేళలా ముందుంటుందన్నారు. ప్రస్తుతం 250 మందికి పైగా భాగస్వాములతో వయోవద్ధులు వారి పిల్లలకు పూర్తి మనశ్శాంతిని అందజేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ పెనుసవాల్‌గా కోవిడ్ 19 మహమ్మారి వెంటాడుతున్న తరుణంలో వయోవద్ధుల సంరక్షణ అనేది మరింత కష్టతరంగా మారిందన్నారు. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఆధారిత యాప్ వినియోగించి 24 గంటల అత్యవసర సహాయాన్ని అందించడానికి క్రమబద్ధమైన పర్యవేక్షణ సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు.
వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సేవలు
ఎసర్స్ అన్వయా స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్, సాంకేతిక పరిష్కారాలను వీలైనంతగా వినియోగించడం ద్వారా 'ప్రోయాక్టివ్ కేర్ వర్సెస్ రియాక్టివ్ కేర్'ను అందిస్తుంది. అందువల్ల ఇది వినూత్నమైనది. ఏఐ, ఐఓటీ ఆధారిత వేరబల్ (పేటెంట్ పెండింగ్)గా వయోవద్ధులకు తోడ్పడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి సైతం వయోవద్ధుల ఆరోగ్యం పర్యవేక్షించే రీతిలో ఏసెర్స్ను డిజైన్ చేశారు. ఇది స్థిరంగా వారి ఆరోగ్య ప్రమాణాలను పర్యవేక్షించడంతో పాటుగా ఏమైనా లోపాలుంటే కనుగొంటుంది. అంతేకాదు, వ్యక్తుల ఆరోగ్యంకు సంబంధించి సమగ్రవీక్షణను అందిస్తుంది ఇంటి వద్దనే చురుకైన సంరక్షణనూ అందిస్తుంది. సంస్థ అందించిన సేవలు 7,154 మందికి ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు చేశారు. హోమ్ క్వారంటైన్ ఉన్న 3,874 మంది రోగుల చికిత్స అందించారు. దేశవ్యాప్తంగా 18,118 మందికి చికిత్స అందించగా 17 మంది కుటుంబాలను వీరు ప్రస్తుతం సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.