Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్లో తాగునీటి సరఫరాలో కలుషిత నీరు వస్తుందని స్థానికుల ఫిర్యాదు మేరకు గురువారం కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ పర్యటించారు. గతంలో రోడ్డు నిర్మాణ పనుల్లో బాగంగా మ్యాన్ హోల్స్ మరమత్తులు సరైన విధంగా చేపట్టకపోవడంతో మురుగు నీటి పారుదల నిలిచి పోవడంతో తాగునీటి పైపులైను, డ్రయినేజీ పక్క, పక్కన ఉండడంతో పాక్షికంగా పగిలిన పైప్ లైన్ల ద్వారా కలుషితమౌతున్నట్లు స్థానికుల ఫిర్యాదుతో తెలుస్తోందని, తక్షణమే ఆయా ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు. తాగునీటి సరఫరాలో కలుషితనీటి నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డివిజన్ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ముందుంటానని పండాల సతీష్ గౌడ్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ శ్రావణ్, కాంట్రాక్టర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.