Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
పానుగంటి లక్ష్మీనరసింహారావు సున్నిత హాస్య రచనల్లో మేటి అని, ఆయన సాక్షి వ్యాసాలు నాటి సామాజిక రాజకీయ వ్యవస్థలపై అధిక్షేపంతో కూడి ఉంటాయని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలో గురువారం ఎందరో మహానుభావులు శీర్షికన నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పానుగంటి లక్ష్మీ నరసింహ రావు జయంతి సమావేశం జరిగింది. తెలుగువారికి అభినవ కాళిదాసుగా ప్రసిద్ధిపొందిన పానుగంటి పీఠాపురం రాజాస్థానం నాటక కవి గౌరవించారని వివరించారు. ఎన్నోనాటకాలను రాసిన పానుగంటికి 'కంఠ భరణం', 'సారంగ ధర, నాటకాలు పేరు తెచ్చాయని తెలిపారు. కవి రఘుశ్రీ మాట్లాడుతూ సాక్షి వ్యాసాలు నేటి తరానికి ఉపన్యాసాలతో వినిపిస్తే వారిలో సామాజిక బాధ్యత పెరుగుతుందని అన్నారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి అధ్యక్షత వహించిన వేదికపై నటుడు మానిక్, భామిడిపాటి ఉష, చరణ్, లతా వర్మ పాల్గొన్నారు.