Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట డివిజన్ నరేంద్రనగర్లో చేపడుతున్న డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ విజరు కుమార్గౌడ్తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా నూతన పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. డ్రయినేజీ పైపులైన్ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం పాదయాత్ర చేపట్టి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు గల్లీలలో డ్రయినేజీ పైపులైన్లు ఎగుడు దిగుడుగా ఉండటంతో ఓవర్ ఫ్లో సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. వీధి దీపాలు, ఐరన్ విద్యుత్ స్తంభాల స్థానంలో సిమెంట్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని ఎమ్మెల్యేను కోరారు. సమస్యలను అధికారుల దృష్టికితీసుకు వెళ్లి వెంటనే పరిష్కరిస్తామ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సిద్ధార్డ్ ముదిరాజ్, లవంగ ఆంజనేయులు, ఆమనూరి సతీష్, రాగుల ప్రవీణ్ పటేల్, మల్లేష్ యాదవ్, ఉమేష్, వేణు, కష్ణచారి, సెంటంచారి, శ్రీనివాస్, బాలరాజు, రాజేష్, రాజు, చైతన్య, స్వాతి, కాలిని, అండాలు, పావణి, రజని, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.