Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో గురువారం స్థానిక కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ రూ. 15 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో కాలనీలు, బస్తీలలో, రోడ్ల నిర్మాణం, బాక్స్ డ్రైన్, డ్రయినేజీ, విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి, ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, మల్కాజిగిరి మహిళా అధ్యక్షురాలు విజయ కుమారి, మల్కాజిగిరి సర్కిల్ మహిళా అధ్యక్షురాలు గద్వాల జ్యోతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉపేందర్, నరేష్, మల్లేష్ గౌడ్, ప్రచార కార్యదర్శి ఉమాపతి, వైశాలీ, లక్ష్మి, కవిత, జయ, సుబ్బలక్ష్మి, బాబు, సత్యనారాయణ, కిషోర్, అశోక్, కిరణ్, ప్రశాంత్ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గాదాస్, కన్నారావు, హరికిషన్, రత్న భూషణ్, జగదీష్, సురేష్, మనోహర్, ప్రసాదరావు పాల్గొన్నారు.