Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
మండలంలోని తుర్కపల్లి గ్రామంలోని మల్లన్న గుడిని గురువారం మేడ్చల్ నియోజకవర్గ టి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు, మండపం నిర్మాణానికి రూ. లక్షలు ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో శామీర్పేట టీఆర్ ఎస్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఉప సర్పంచ్ యూసఫ్, వార్డ్ నెంబర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.