Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
430 గ్రాముల రెండు గంజాయి బాక్సులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. సరూర్‌నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వివరాల ప్రకారం సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు చెందిన అధికారులు, సిబ్బంది ఉదయం 5.30 గంటలకు కామినేని హాస్పిటల్ వద్ద నిర్వహించిన రూట్ వాచ్‌లో భాగంగా ఎండు గంజాయిని ట్రాన్స్‌పోర్టు చేస్తున్న గుణశేఖర్ అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి 320 గ్రాముల ఎండు గంజాయిని, యమహా ఎఫ్.జెడ్ అనే బైకుని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించిన రూట్ వాచ్ లో భాగంగా ఎండు గంజాయిని ట్రాన్స్‌పోర్టు చేస్తున్న కర్నాటి స్వామి నరేందర్, హరిచంద్ర ప్రసాద్ అను వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి 430 గ్రాముల ఎండు గంజాయిని, హౌండా యాక్టివా బైకుని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎవరైనా నిషేధిత పదార్థాలు గంజాయి, డ్రగ్స్‌ని కలిగి ఉన్నా, సరఫరా చేసినా, అమ్మినా చట్టప్రకారం శిక్షలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు ముజాహిద్ సుతారి, ఇబ్రహీం భాష, సమజ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.