Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందంచడంలో అనురాగ్ యునివర్సిటీ ప్రఖ్యాతి గాంచిందన యునివర్సిటీ సీఈఓ సూర్యదేవల నీలిమ అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ యునివర్సిటీలో శుక్రవారం అనురాగ్ సెట్ 2022 పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100 ఎకరాలకు పైగా యునివర్సిటీ ప్రాంగణంలో 400 మంది ఉత్తమ ఫ్యాకల్టీ, 150 మందికి పైగా డాక్టరేట్స్ల పర్యవేక్షణలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా పేరుగాంచిన సాఫ్ట్వేర్ కంపనీలైన టీసీఎస్, కాగ్నిజెంట్, విఫ్రో, ఇన్ఫోసిస్, అమెజాన్ తదితర సంస్థల్లో ఒకోక్క సంస్థలో 250 మంది విద్యార్థులుగా మొత్తం 1700 మందిని ఈ ఏడాది రిక్రూట్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్‌లో భాగంగా లిబరల్ ఆర్ట్స్ అనగా ఎకనామిక్స్‌లో బీఏ మల్టీమీడియా, జర్నలిజం, బీకాం కోర్సులు అందిస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం ఏడాది అనురాగ్ సెట్ మార్చి 4-6 నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే రిజిస్టేషన్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ సెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనం ఉంటుందనీ, ఐదు వందల మంది విద్యార్ధులకు ల్యాప్ టప్లు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునివర్సిటీ చాన్స్‌లర్ యు.బి.దేశారు, వైస్ చాన్స్‌లర్ రామచంద్రం, రిజిస్టార్ సైదా సమీన్ ఫాతిమా, ఢన్ీ విష్ణుమూర్తి, అకాడమిక్ కో-ఆర్డినేటర్ మహిపతి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.