Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఫస్టియర్ చదివే విద్యార్థులకు ఇంత వరకు హాస్టళ్లు ప్రారంభించలేదు. ఇంత వరకు ఆఫ్‌లైన్ క్లాసులూ ప్రారంభించలేదు. పీజీ చేయాలన్న ఆశతో వచ్చిన విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యంతో అవస్థలు పడాల్సి వస్తోంది. ఇక్కడికి వచ్చేవారిలో 80 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కావడంతో మెస్‌లు, హాస్టళ్లు తెరవకపోవడంతో చాలామంది బంధువులు, ఫ్రెండ్స్ వద్ద ఉంటూ ఆఫ్‌లైన్ క్లాసుల ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో అధికారుల మౌఖిక ఆదేశాలతో ఓయూలో ఫస్టియర్ స్టూడెంట్స్‌కు ఆన్లైన్ క్లాసులు మాత్రం నిర్వహిస్తున్నారు.
ముందే తెలుసు.. అయినా ఏర్పాట్లలో వైఫల్యం..
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ విద్యా సంవత్సరం ఫస్టియర్‌లో సుమారు 75 శాతానికిపైగా విద్యార్థినులే పీజీలో అడ్మిషన్స్ పొందారు. ప్రస్తుతం లేడీస్ హాస్టల్స్లల్లో అన్ని బ్లాక్స్ పూర్తిస్థాయి సామర్థ్యం కంటే ఎక్కువ సంఖ్యలో నిండిపోయి ఉన్నాయి. దీంతో కొత్త విద్యార్థులకు హాస్టళ్ల సమస్య ఏర్పడింది. దీంతో అధికారులు ఎక్కడ వసతి కల్పించాలోనని తర్జన భర్జన పడుతున్నారు. కొత్తగా హాస్టళ్ల కేటాయింపు కోసం అన్వేషణలో పడ్డారు. పీజీలో పెద్దఎత్తున విద్యార్థినులు అడ్మిషన్స్ పొందిన విషయం ఆరునెలల ముందే తెలిసినా అధికారులు ఇప్పటి వరకు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం.
ఓయూలో బార్సు బీ హాస్టల్‌ను ఫిస్టయర్ గర్ల్స్ కోసం కేటాయించాలనుకున్నారు. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ హాస్టల్‌ను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తే ఆ కాలేజీ లెక్చరర్లు తమ స్టూడెంట్స్‌కే కావాలని ఒప్పుకోలేదు. కొత్తగా బాలుర కోసం నిర్మించిన సెంటినరి హాస్టల్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నా, నిర్మాణం పూర్తయి రెండేండ్లు కావస్తున్నా ఓయూ అధికారుల హ్యాండవర్ కాలేదని సమాచారం. పైగా ఈ నూతన భవనంలో సౌకర్యాలేవీ లేవు. తరచూ వీసీ సమావేశాలు జరగుతున్నాయి కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఒక అధికారి పేర్కొన్నారు. గతంలో కంటే ప్రిన్సిపాల్స్‌కు ఉన్న ఫైనాన్స్ పవర్స్ తగ్గించడంతో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న చిన్నా చితకా సమస్యలను కూడా వారు పరిష్కరించలేకపోతున్నామని పలువురు ప్రిన్సిపాల్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిజాం కాలేజ్‌లో 270 మంది స్టూడెంట్స్ ఉండేందుకు చేపడుతున్న నిర్మాణాన్ని యూజీ విద్యార్థినులకు కేటాయిస్తారో? లేక పీజీ విద్యార్థినులకు కేటాయిరాస్తారో వేచి చూడాల్సిందే. ఇంకో వైపు ఈ హాస్టల్‌కు కూడా ప్రహరీ నిర్మించి 15 రోజుల్లో సదరు కాంట్రాక్టర్ హ్యాండవర్ చేయనున్నట్టు తెలిసింది.
బ్లాక్స్ మారేది లేదంటున్న విద్యార్థినులు
మరోవైపు ప్రస్తుతం లేడీస్ హాస్టల్స్‌లోని పలు బ్లాక్స్లల్లో కాలేజీల వారీగా విద్యార్థులకు కేటాయించేందుకు అధికారులు ప్రయత్నించగా వారు దీన్ని వ్యతిరేకించారు. ఓయూ రిజిస్ట్రార్, ఓస్డీల ఎదుటే తాము మారేది లేదని స్పష్టం చేశారు. ఫస్టియర్ విద్యార్థినులకు హాస్టల్ ఎప్పుడు ప్రారంభిస్తారని చీఫ్ వార్డెన్ డా.శ్రీనివాసరావును, లేడీస్ హాస్టల్ డెరైక్టర్ డా.పద్మను వివరణ కోరగా పై ఆఫీసర్ల నుంచి ఆదేశాలు రాగానే ప్రారంభిస్తామన్నారు.
ఫస్టియర్ క్లాసులు వెంటనే ప్రారంభించాలి
అధికారుల ఛాంబర్సుకు ఆఘమేఘాల మీద అధునాతన సౌకర్యాలు రోజుల వ్యవధిలోనే ఏర్పాటు చేసుకునే ఓయూ పెద్దలు నేటి విద్యార్థినులకు హాస్టళ్లు ఏర్పాటు చేయలేదు. తక్షణమే హాస్టళ్లు ప్రారంభించాలి. ఔట అధ్యక్షులు ప్రొ.మనోహర్