Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి కమ్మగూడ గ్రామంలో ఉన్న బాలయేసు చర్చి వార్షిక మహౌత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఈ చర్చిని నిర్మించారు. ఇది దేశంలోనే మూడోది. 1992లో చర్చి విస్తరణ చేపట్టారు. ఈ నిర్మాణానికి ఒక విశిష్టత ఉంది. చర్చిని బయట నుంచి చూస్తే మత్స్యకారంలో కనబడుతుంది. ఇరువైపులా ధవళ వర్ణంలో వంద అడుగుల ఎత్తులో రెండు గాలిగోపురాలు నిర్మించి, 150 కిలోల కంచు గంటను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో బాలయేసు వివిధ రూపాల ప్రతిమలను ఏర్పాటు చేశారు. అద్భుత బాలయేసు చర్చిలో వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి 2 ఆదివారం ఈ మహౌత్సవాన్ని గ్రామ ప్రజలు (ఊరి పండుగగా) జరుపుకుంటారు. బాలయేసు చర్చిలో వార్షిక బ్రహ్మౌత్సవాలను పురస్కరించుకుని చర్చి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చర్చిని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. శనివారం ఉదయం ఫాదర్ సీిహెచ్ బెంజమిన్ కుటుంబ జీవిత ప్రాథమిక అంశాలు తెలుగులో దివ్య బలి పూజ, ఫాదర్ జి ఆరోగ్య స్వామి తో సాయంత్రం ఐదు గంటలకు ఘంటారదన, ఈ చర్యతో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆదివారం తెల్లవారుజామున దివ్య బలిపూజ, ఐదు గంటలకు విల్సన్‌తో దివ్యబలిపూజ, ఉదయం 6 గంటలకు నగరంలోని బోయ గోడ నుంచి బాల యేసు పేరు ప్రదక్షణ ఆరంభించి ఊరేగింపుగా తీసుకురానున్నారు. ఈ మహౌత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారని నిర్వాహకులు తెలిపారు. చర్చికి వచ్చే భక్తులు కరోనా జాగ్రత్తలు పాటించాలని వారు తెలిపారు.
ప్రత్యేక బస్సులు ఇలా..
బాలయేసు వార్షిక మహౌత్సవానికి ఆర్టీసీ నగరంలోని వివిధ పాంత్రాల నుంచి
కమ్మగూడకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 277 మహత్మాగాంధీ బస్సు స్టేషన్,
మెహిదీపట్నం, నాంపల్లి కోఠి, నల్గొండ చౌరస్తా నుంచి 277, కోఠి దిల్సుఖ్ నగర్ నుంచి ,102/277-కోరి సికింద్రాబాద్, 279, జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్, సబర్బన్, ఇతర జిల్లాల నుంచి కమ్మగూడ చర్చి వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తారు.