Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మన ఆహార్యం మనలోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుందని సినీనటి, ప్రముఖ వ్యాఖ్యాత సుమ కనకాల అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2లో నూతనంగా ఏర్పాటు చేసిన వెర్నాన్ అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లీనిక్‌ను సుమ ప్రారంభించి మాట్లాడారు. అందాల రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఎలాంటి దుష్పరిణామాల్లేకుండా ఈ సేవలు అందిస్తున్న సంస్థలు ఇప్పుడు మన ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా జుత్తు, సౌందర్య పోషణ విషయంలో చాలా మంది ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారన్నారు. సినిమా పరిశ్రమ, అందాల పరిశ్రమ, ఫ్యాషన్ ఇండిస్టీలతోపాటు నేటి యువతులకు సౌందర్యానికి మెరుగులు దిద్దే ఇలాంటి కేంద్రాలు ఎంతో ముఖ్యం అన్నారు. వెర్నాన్ లాంటి వైద్యుల పర్యవేక్షణలో ఇప్పుడు నగరంలో అధునాతన సేవలు పొందవచ్చన్నారు. సుప్రసిద్ధ సౌందర్యం, చర్మం, జుట్టు సంరక్షణ నిపుణుడు, వెర్నాన్ నిర్వాహకులు డాక్టర్ ఆర్.బ్రహ్మనాదరెడ్డి మాట్లాడుతూ మారుతున్న వైద్య నైపుణ్యాలు, చికిత్స పద్ధతులు, సాంకేతిక పద్ధతులతో చికిత్సనందిస్తున్నామన్నారు. ఈ వెర్నాన్ ఇంటీరియర్ సౌందర్యం మాత్రమే కాకుండా వచ్చే అతిథులను ఆహ్లాదంగా ఉంచడానికి ఈ కేంద్రం ప్రత్యేకంగా తీర్చిదిద్దామన్నారు. లేజర్ హెయిర్ రిడక్షన్, పిగ్మెంటేషన్, యాక్నే అండ్ స్కార్ ట్రీట్మెంట్, పీఆర్పీ హెయిర్ రిజువెనేషన్, పీఆర్పీ స్కిన్ రిజువెనేషన్, యాంటీ ఏజింగ్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, టాటూ రిమూవల్, బోటాక్స్, ఫిల్లర్స్, నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్‌లు స్ట్రెచ్ మార్క్ ట్రీట్మెంట్, ట్రీట్రాయిడ్ ట్రీట్మెంట్ మొటిమ అండ్ స్కిన్ ట్యాగ్ తొలగింపు చికిత్సలను ఇక్కడ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, జబర్దస్త్ ఆర్టిస్టులు శ్రీను, కార్తీక్, మోడల్ పాల్గొన్నారు.