Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిస్కారం కోసం ఎంతో కృషి చేస్తుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సిహ్మరెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. డివిజన్ లో నెలకొన్న అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. 31వ డివిజన్ శ్రీసాయి బాలాజీ ఫేస్ 2 కాలనీలో పలు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికులతో కలిసి కాలనీలో పర్యటించి, కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ అశోక్ రెడ్డి, ఏఈఈ బిక్కు నాయక్, కాలనీ వాసులు రాజు నాయక్, చంద్రయ్య, రాము గౌడ్, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.