Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఇంద్ర నగర్ పల్లె దావఖానను సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పల్లె దావఖానలోని సమస్యలను డాక్టర్ తమ దష్టికి తీసుకుని వచ్చారని, తక్షణమే దావఖాన భవనానికి విద్యుత్ సరఫరా వచ్చేలా చూస్తానని, మరుగుదొడ్డి సౌకర్యం కూడా తొందరలోనే కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, రాజేష్ చంద్ర, ఇందిరానగర్ బస్తీ ప్రెసిడెంట్ కాసాని శంకర్, శివరాజ్ గౌడ్, డాక్టర్ మౌనిక, బస్తీ వాసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.