Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
చైతన్యపురి డివిజన్ దళిత మోర్చా అధ్వర్యంలో దిల్ సుఖ్ నగర్ లో శుక్రవారం సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రంగా నర్సిం హాగుప్తా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అవమాన పరిచిన కేసీఆర్పై చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందనీ, ఆదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన కేసీఆర్ అధికార మదంతో రాజ్యాంగాన్ని అవమనించ డం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్లబ్ కన్వీనర్ పసుపుల హరి బాబు, మల్కాజిగిరి పార్లమెంట్ కన్వీనర్ కృష్ణ ప్రకాష్, రంగా రెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రుద్రారాపు శంకర్, డివిజన్ అధికార ప్రతినిధి పర్ల శివ కుమార్, చైతన్యపురి డివిజన్ ప్రధాన కార్యదర్శి రవి కుమార్, ఉమేష్, సత్యం, సుమన్, భాను ప్రకాష్, యువ మొర్చ ప్రధాన కార్య దర్శి వి.శివ కుమార్ పాల్గొన్నారు.