Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్ పేట
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట సంజీవిని అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన గుండెబోయిన మల్లేష్ యాదవ్ అభ్యర్ధన మేరకు మంత్రి చొరవతో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును శుక్రవారం బోయిన్పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్దిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింగం ఆంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వనందాస్ మురళి గౌడ్, మూడు చింతలపల్లి మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు ఎల్లగౌని చిత్తయ్య గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు గౌటే గోపాల్, ముక్కర్ల సంజీవ యాదవ్ పాల్గొన్నారు.