Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
వ్యర్థాల నుంచి తయారయ్యే మరో విద్యుత్ ప్రాజెక్టును దుండిగల్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ద్వారా జవహర్‌నగర్ డంప్ యార్డులో 19.8 మెగావాట్ల విద్యుత్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీతోపాటు చుట్టు పక్కల పట్టణ ప్రాంతాలకు చెందిన చెత్తను జవహర్‌నగర్ డంప్ యార్డుకు తరలించే ప్రక్రియను సమగ్ర మున్సిపల్ ఘన పదార్థాల నిర్వహణ ప్రాజెక్టుగా పరిగణిస్తారు. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ఫÛర్ పాయింట్స్ నుంచి వ్యర్థాలను జవహర్‌నగర్ డంప్ యార్డు తరలిస్తారు. తరలించిన వెంటనే అక్కడ యాంత్రికంగా సెగ్రిగేట్ చేసిన తర్వాత మండే గుణం గల వ్యర్థాలను వేరు చేస్తారు. 19.80 మెగావాట్లను ఉత్పత్తి చేసేందుకు రోజుకు 1200 నుంచి 1500 టన్నుల వ్యర్థాలు అవసరం ఉంటుంది. ఆ విధంగా ఆగస్టు 2020 నుంచి నవంబర్ 2021 వరకు 5.4 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్డీఎఫ్ వ్యర్థాలను వినియోగించి 185 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. జీహెచ్ఎంసీ ద్వారా 6500 టన్నులపై బడి చెత్తతో పాటుగా చుట్టుపక్కల వున్న 17 మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ద్వారా ప్రతి రోజూ 600 వరకు టన్నుల చెత్తతో మొత్తం 7 వేల టన్నుల వ్యర్థాలు జవహర్‌నగర్ డంప్ యార్డుకు తరలిస్తారు. అట్టి వ్యర్ధాలను సాంకేతికంగా సెగ్రిగెట్ చేస్తారు. పేరుకుపోయిన వ్యర్థాల వలన పక్కన ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరోధించేందుకు 19.8 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 48 మెగావాట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచగా దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అట్టి పనిని 18 నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తేనున్నారు. జవహర్‌నగర్ డంప్ వలన ఆ ప్రాంత ప్రజల పడుతున్న ఇబ్బందులను తగ్గించడం కోసం వ్యర్థం నుంచి 14.5 మెగావాట్ల విద్యుత్‌ను దుండిగల్‌లో ఏర్పాటు చేయనున్నారు. దుండిగల్‌లో గల ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీకి సంబంధించిన భూమిలో ఏర్పాటు చేశారు. అట్టి ప్లాంట్ పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 2022 నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. వ్యర్థం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చెత్తను దుండిగల్ పరిసర పట్టణ ప్రాంతాల నుంచి, జీహెచ్ఎంసీ పరిధిలో గల ప్లాంట్‌కు సమీపంలో గల ప్రాంతం నుంచి వ్యర్థాలను తరలించడంతో జవహర్‌నగర్ డంప్ యార్డుకు కొంచెం భారం తగ్గే అవకాశం ఉంది. 14.5 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తికి 1000 టన్నుల వ్యర్థం అవసరం ఉంటుంది. వ్యర్థం నుంచి విద్యుత్ తయారీకి యాప్రాల్‌లో 14 మెగావాట్లు, బీబీనగర్ దగ్గర చిన్న రేవులపల్లిలో 11 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయివేటు సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ వివిధ కారణాల వలన ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయలేక పోతున్నారు.