Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్ నగర్ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కాకతీయ నగర్ రోడ్డు నెంబర్ 8లో జరుగుతున్న భూగర్భ డ్రయినేజీ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి గల్లీలో భూగర్భ డ్రయినేజీ వ్యవస్థను నిర్మిస్తున్నాం అన్నారు. వర్షాలు కురిసినా నీరు నిలువకుండా, బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేస్తాం అన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని వర్క్ ఇన్స్పెక్టర్ సాగర్, కంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఓం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఆర్.మణి రత్నం, ఉపాధ్యక్షులు సాయి సురేష్, సర్వేష్ యాదవ్, సుశీల, సోమనాథ్ చారి, కృష్ణ, రాజు పాల్గొన్నారు.