Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని కీసర సీఐ రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బోగారం గ్రామ పంచాయతీ పరిధిలోని హౌలీ మేరీ ఇంజినీరింగ్ కాలేజీలో సీఐ డ్రగ్స్‌పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ మత్తులో విద్యార్థులు పక్కదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల మత్తులో జీవితాల్ని పాడు చేసుకోవద్దనీ, మత్తులో నేరాలు చేసి నేరస్తులుగా మారొద్దని సూచించారు. డ్రగ్స్ వాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. చట్ట ప్రకారం కొకైన్, హెరాయిన్, గంజాయి, నాటు సారా లాంటి మత్తు పదార్థాలు వాడటం తో మనిషి మెదడు పై ప్రభావం చూపుతుందనీ, తద్వారా ఆలోచనా శక్తి తగ్గి విద్యార్థులు నేరాల బాట పడుతు న్నారన్నారు. దీనికి కుటుంబపరంగా తల్లితండ్రులు కూడా పిల్లల పట్ల ఎప్పటికప్పుడు దృష్టి సారించాల న్నారు. గంజాయి, మత్తు పదార్థాలు దొరికితే గరిష్టంగా 20 ఏండ్లు జైలు శిక్ష లేదా ఒక్కోసారి నేరాన్ని బట్టి మరణ శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఎవరైనా గుర్తు తెలియని బయటి వ్యక్తులు వచ్చి గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను అమ్మినా, కొన్నా చట్టరీత్యా బాధ్యులు అవుతారనీ, అలాంటివారు ఎవరైనా విద్యార్థులకు కనిపిస్తే కీసర పోలీస్ స్టేషన్లోకానీ, రాచకొండ వాట్సాప్ 9490617111 నెంబర్‌కు కానీ ఫిర్యాదు చేయాలని తెలిపారు. డ్రగ్స్ రహిత కాలేజీలుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సంద ర్భంగా డ్రగ్స్ రహిత కాలేజీగా తీర్చిదిద్దాలని విద్యార్థు లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య, సబ్ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రావణి, కీసర సబ్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, కాలేజీ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.