Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బాలంరాయిలో కంటోన్మెంట్ బోర్డు కేటాయించిన కంటోన్మెంట్ స్థలంలో గౌతమ్ మునిజీ జైన్, చారిటబుల్ కటారియా జైన్ కుటుంబ సభ్యులు నిర్మించిన ఆస్పత్రిని శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరు కావాల్సి ఉంది. కానీ పాండిచేరిలో ఆమె అత్యవసర పనుల్లో నిమగమై ఉండటం వల్ల వర్చువల్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి, బోర్డు నామినేటెడ్ సభ్యుడు జి.రామకష్ణ పాల్గొని ప్రారంభించారు. గవర్నర్ తమిళ సై వర్చువల్గా పాల్గొని జైన్ సమాజాన్ని అభినందించారు. కంటోన్మెంట్ ప్రజల కోసం ఆస్పత్రి నిర్మించిన గౌతం జైన్ కటారియా కుటుంబీకులను అభినందించారు.