Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
మహిళలను అందరూ గౌరవించాలనీ, మన సంస్కృతి, సంప్రదాయం ప్రకారం కూడా అది అందరి బాధ్యత అని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. మహిళలను కించపరచడం తగదని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై, ఈవ్ టీచర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయ ఆవరణలోని షీ-టీమ్ కార్యాలయంలో భూమిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు వారి కుటుంబ సభ్యులతో కలిసి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఏడు వారాల కాలంలో 75 మందిని అరెస్ట్ చేశామని, 12 మంది బాల్య వివాహాలను ఆడ్డుకున్నామని తెలిపారు. 57 కేసులు నమోదు కాగా అందులో 16 కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు చేశామని, 27 కేసుల్లో 14 మందికి కౌన్సెలింగ్‌లు ఇచ్చామని చెప్పారు. అందులో 42 మంది మేజర్లు, 33 మంది మైనర్లు ఉన్నారని తెలిపారు. మహిళలను, బాలికలను ఇబ్బందులకు గురిచేసినట్టు తెలిస్తే 9490617111 నెంబర్కుగాని, 100కు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ డీసీపీ సలీమా, సిబ్బంది రవీందర్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.