Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతం రావు
నవతెలంగాణ-అంబర్పేట
ప్రజావ్యతిరేక విధానాలపౖౖె పోరాడాలని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతం రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం అంబర్పేట డివిజన్ పరిధిలోని బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భతి, రైతులకు రుణమాఫీ, దళిత బంధు, నగరంలో ఉచిత తాగునీరు ఇలా అనేక హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగభూషణం చారి, సీనియర్ నాయకులు గంధమాల ఆనంద్ గౌడ్, బిక్షపతి, యశ్వంత్, మమిడల వెంకీ, సునీల్ కుమార్. మనోజ్ యాదవ్, భారత్ కుమార్, జగన్ యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.