Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
బూత్ స్థాయిలో బీజేపీని పటిష్టపరచాలని జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం బాగ్ అంబర్‌పేట డివిజన్ డీడీ కాలనీలో బూత్ నెంబర్ 19, 21 సమావేశం నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జ్ బి.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ డివిజన్లో ఉన్న శక్తి కేంద్రాల వారీగా సమావేశాలు నిర్వహించి బీజేపీని పటిష్ట పరచాలని అన్నారు. అనంతరం బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పటిష్టపరిచేందుకు ప్రతి బూతులో ఐదు మంది మహిళలకు తగ్గకుండా చూడాలని అన్నారు. బూత్‌స్థాయిలో బిజెపిని పటిష్టపరిచేందుకు ప్రతి కార్యకర్త కషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు, శక్తి కేంద్ర ప్రముఖ్ రాజిరెడ్డి, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు చుక్క జగన్, 19, 21 బూత్ అధ్యక్షులు రామ్‌రెడ్డి, ప్రేమ్ కుమార్, సరస్వతి, బట్టర్, రమేష్‌రెడ్డి, నాయకులు మిర్యాల శ్రీనివాస్, సతీష్ గౌడ్ పాల్గొన్నారు.