Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోయపల్లి శేఖర్ గౌడ్, ముద్దగౌని రామకష్ణ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా చెన్నగొని రమేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూరేళ్ల వేములయ్య గౌడ్ వారికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అఖిల భారత గౌడ సంఘం జాతీయ కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దగోని నగేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల పద్మ గౌడ్, రంగారెడ్డి జిల్లా మహిళ అధ్యక్షురాలు బీయగూడెం శ్రీలత గౌడ్, రాష్ట్ర కోశాధికారి పల్లె శ్రీనివాస్ గౌడ్ ల సమక్షంలో నియామక పత్రాలను అందజేశారు. అనంతరం వేములయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గీతా కార్మికుల సమస్యల పట్ల, గౌడ కుల పేద విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కషి చేయాలని కోరారు. సంఘం బలోపేతానికి పాటుపడాలని వారికి సూచించారు. వనస్థలిపురంలో ఉన్న అనాథ విద్యార్థి గహంలో భోజనం నిమిత్తం 100 కేజీల బియ్యాన్ని విరాళంగా అందజేశామని తెలిపారు.