Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద,్ స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ యాదవ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరను పురస్కరించుకొని మల్లికార్జున స్వామి వారిని, రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగరాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.