Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఆలయ ఆర్చ్ నిర్మాణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల చౌరస్తా (బస్ డిపో) వద్ద జీహెచ్ఎంసీ పరిధికి చెందిన వడ్డెర సంఘం సహకారంతో రూ.6 లక్షలతో నూతనంగా చేపడుతున్న శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయ అర్చ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇంద్రసేన గుప్త, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, నాయకులు నాగిళ్ళ శ్రీనివాస్, చౌడ శ్రీనివాస్‌రావు, సోమేష్ యాదవ్, వేణు యాదవ్, ముకుందరావు, పరుష శ్రీనివాస్ యాదవ్, ఆకుల రాజ్‌కుమార్, వర ప్రసాద్, కమిటీ సభ్యులు యాదగిరి, శ్రీరాములు, సురేష్, నర్సింహారెడ్డి, సంజీవరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, నర్సింహా, వడ్డెర సంఘం సభ్యులు మల్లేష్, గండయ్య, శ్రీనివాస్, యాదగిరి, సత్తయ్య, నిరంజన్, రవిందర్, భాస్కర్, కృష్ణ, శ్యామ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం
కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్ 1లోని శ్రీశ్రీశ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శిఖర, ధ్వజ స్థంభ ప్రతిష్టా మహోత్సవంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రంగారెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ బి.విజరుశేఖర్గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, సీనియర్ నాయకులు సోమేష్ యాదవ్, పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.
కట్టమైసమ్మ ఆలయంలో పూజలు
సూరారం డివిజన్ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ జాతర సందర్భంగా ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ , నాయకులు వారాల వినోద్, మన్నె రాజు, మన్నె బాలేష్, యాదిరెడ్డి, రాఘవరెడ్డి , సోమేష్ యాదవ్, వేణుయాదవ్, సురేష్, మహేష్, మైపాల్, గోపాల్, రమేష్‌గౌడ్, యూసుఫ్, ప్రభాకర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.