Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
జీహెచ్ఎంసీ కార్మికులకు 24వేల రుపాయల కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ ప్రభుత్వాని కోరారు. హైదరాబాద్ మహానగరాన్ని శుభ్రంగా ఉంచడంలో కేంద్ర బిందువుగా ఉన్న జీహెచ్‌ఎంసీి పారిశుధ్య కార్మికులకు తక్షణమే ఒక్కొక్కరికి 24వేల వేతనం అందించాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సీిఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య కలిసి ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో చంపాపేట పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల సమస్య లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులు రోజుకు 600 మీటర్ల వరకు శుభ్రం చేయాలని నిర్ణయం తీసుకొని శ్రమదోపిడీికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకా కుండా కార్మికుల నుండి నెలకు 600 రూపాయలు కార్మికుల వేతనాల నుంచి అధికారులు కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గతంలో 21 మందితో గ్రూపు ఉండేది. ఇప్పుడు 7మందికి ఒక్క గ్రూపుగా విభజించారని పేర్కొన్నారు . గతంలో ఎవరి అకౌంట్లో వారి వేతనాలు వేసేవారని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారులు కావాలని చెప్పి ఏడు మందితో ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేశారని అన్నారు. వేతనాలు ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. కాలనీలు పెరగడం వలన కార్మికులకు పని భారం పెరిగిందన్నారు.
ఉద్యోగ భద్రత లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్వైజర్లు, కార్మికులపై అధికారులు ఒత్తిడి తీసుకువస్తే సీఐటీయూ సంఘం చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. మార్చి 28, 29 జాతీయ సమ్మెను. కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలమ్మ, వెంకటమ్మ, సంతోష చుక్కమ్మ. లలిత బాయమ్మ, కష్ణమ్మ, సంపూర్ణ, దేవమ్మ, కమలమ్మ భారతమ్మ, అనురాధ, రాములమ్మ, సంతోష, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.