Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్నగర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఆదివారం సరూర్నగర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఖో-ఖో రెప్రీస్ క్లీనిక్, సర్టిఫికెట్స్ డిస్ట్రిబూషన్ - 2022. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫిÛకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతున్నదని అన్నారు. క్రీడా రంగానికి క్రీడలకు, క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి, వారి ప్రతిభను గుర్తించి, వాళ్ళను ప్రోత్సహించడం చాలా అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రీడల కోసం జిల్లాకు ఒక స్టేడియం నిర్మాణం చేస్తున్నారని అన్నారు. క్రీడాకారులు మంచిగా క్రీడల్లో రాణించి, జాతీయ స్థాయిలో విజయం సాధించి, దేశానికి, తల్లిదం డ్రులకి మంచి పేరు తేవాలని అన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖో-ఖో సంఘం అధ్యక్షుడు జె.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణ, తెలంగాణ ఖో-ఖో సంఘం నిర్వాహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.