Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ వినతి
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఫైనాన్స్ ఆఫీసర్‌గా గిరిజన ఉద్యోగి రామ్ చందర్ నాయక్‌ను కొనసాగించాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ కోరారు. ఆదివారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుని కలిసి వినతిపత్రం అందజేశారు. 2016లోనే సీనియార్టీ ప్రకారం ఫైనాన్స్ ఆఫీసర్‌గా అవకాశం ఉన్నా యూనివర్సిటీ అధికారులు ఇవ్వకపోగా సంవత్సరం కిందట ఇన్చార్జి ఫైనాన్స్ ఆఫీసర్‌గా నియమించి ఇప్పుడు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలో ఆనవా యితీగా సీనియార్టీ ప్రకారం వచ్చే ఫైనాన్స్ ఆఫీసర్ పదవిని రామచంద్ర నాయక్‌ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి ఉస్మానియా యూనివర్సిటీ వీసీకి తెలియజేస్తాం అని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన శక్తి ఓయూ అధ్యక్షులు హనుమంతు నాయక్, ప్రధాన కార్యదర్శి సతీష్ నాయక్, ఉపాధ్యక్షులు వినోద్ నాయక్ పాల్గొన్నారు.