Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకల అణిచివేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందేల శ్రీరాములు యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడంగ్‌పేట కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి న్యాయపరంగా కలెక్టర్ ఇచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులపై పోరాటం చేయాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణిచి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, పోలీసుల అధికార బలంతో దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజరు సలహాలు సూచనలతో బడంగ్ పేట కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి విషయంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించి న్యాయపరంగా, సామాజికంగా ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో బడంగ్‌పేట కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.